SHALEM`S MESSAGE కాళ్ళు చేతులలో మేకులు కొట్టబడిన యేసు
00:00
00:00
Embed Code (recommended way)
Embed Code (Iframe alternative)
Please login or signup to use this feature.

కాళ్ళు చేతులలో మేకులు గుచ్చబడిన యేసు (2015-Mar-16)
ప్రవచనం: కీర్తన Ps 22:16 కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి. దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.
నెరవేర్పు: యోహాను John 20:24-25 యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులుమేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు -నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.
క్రీస్తు కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయి? మన కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయి?
A. పరమ Song 5:14-15 అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి. అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది. అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి.
B. యెషయా Isa 59:3 మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి.
C. యెషయా Isa 59:7 వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును
మన నడతలు, మన చేతలు అంటే మన ప్రవర్తన అంతా పరిశుద్ధపరచడానికే క్రీస్తు కాళ్ళు చేతులలో మేకులు కొట్టబడ్డాయి.
A. కీర్తన Ps 37:23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.
B. యిర్మీయా Jer 10:23 యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.
మన కాళ్ళూ చేతులు బలపరచబడాలని యేసు క్రీస్తు కాళ్ళూ చేతులలో మేకులు కొట్టబడ్డాయి.
A. యెషయా Isa 35:3 సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి.
B. కీర్తన Ps 18:33-34 ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు. ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును.
C. ఎఫెసీ Eph 6:15-17 పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.

Licence : CC BY-SA 3.0


X